Monday, November 25, 2024

8,9,10 తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు

- Advertisement -
- Advertisement -

Online classes for grades 8910 from Jan 24

రేపటి నుంచే అమలు
రొటేషన్ పద్ధతిలో 50% టీచర్లు, సిబ్బంది హాజరు కావాలని విద్యాశాఖ ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి పాఠశాలల్లోని 8,9,10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్ క్లాసులకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ, సిబ్బంది రోటేషన్ పద్ధతిలో 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉదృ్ధతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News