Monday, December 23, 2024

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ పరీక్ష తేదీలు ఖరారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ఆన్‌లైన్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 20,21 తేదీలలో స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెకట్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుండి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుండి 4.30 వరకు రోజూ 2 విడతలుగా పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్ అన్ని లాంగ్వేజ్ సబ్జెక్టులకు పరీక్షలు ఉదయం ఒక విడత, మధ్యాహ్నం మరొక విడత పరీక్షలు జరుగనున్నాయి. 23వ తేదీన పిఇటి అభ్యర్థులకు ఒక్క విడతలోనే ఉదయం 9 నుండి 11.30 వరకు పరీక్ష పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా నవంబర్ 24వ తేదీన లాంగ్వేజి పండిట్ పరీక్ష 2 విడతల్లో, 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆరు రోజులు రోజూ రెండు విడతల్లో ఎస్‌జిటి పరీక్షలు జరుగనున్నాయి. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షను 80 మార్కులకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో 160 ప్రశ్నలతో రెండు భాషలలో(తెలుగు, ఇంగ్లీష్ లేదా ఉర్దూ, ఇంగ్లీష్) ప్రశ్నాపత్రం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News