Monday, December 23, 2024

ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు … చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో పిజి విద్యార్థి ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సంజయ్ గాంధీ నగర్ లో ఎంకే విద్యార్థి భాను ప్రకాష్ (22) ఆరోరా కళాశాలలో మాస్టర్స్ చదువుతున్నాడు. ఇటీవల లోన్ అప్స్ వేధింపుల తాళలేక మదన పడుతున్న భాను గురువారం సాయంత్రం ఫాక్స్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మొబైల్ లొకేషన్ ద్వారా ఆచూకీ కనుగొన్న స్నేహితులు చెరువు వద్దకు వెళ్లి చూడగా అతని దుస్తులు, వాహనం కనిపించాయి. ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేయడంతో శుక్రవారం ఉదయం గాలింపు చేపట్టగా చెరువులో భాను మృతదేహం లభ్యమైంది.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News