Thursday, December 26, 2024

ఆన్‌లైన్ సమ్మక్క -సారక్కలకు బంగారం సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం సమ్మక్క – సారక్కలకు ఆన్‌లైన్ ద్వారా నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ,ఎంఎల్‌ఎలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం తన మనవడు రియాన్ష్ నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన మనవరాలి నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఆన్‌లైన్‌లో నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.
ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ పోస్టర్ ఆవిష్కరణ
మేడారం మహాజాతరలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ, జాతరను పరిశుభ్రంగా స్వచ్ఛంగా జరుపుకోవాలని కోరుతూ శుక్రవారం అసెంబ్లీ కమిటి హాలులో సిఎం రేవంత్ రెడ్డితో కలిసి అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, సీతక్క, సిఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

Revanth 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News