Thursday, November 14, 2024

ఆన్‌లైన్‌ షాపింగ్.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి

- Advertisement -
- Advertisement -

Online shopping: young woman who lost Rs 1.90 lakh

 

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసిన ఓ యువతి తన అకౌంట్ నుంచి రూ. 1.90 లక్షలు పోగొట్టుకున్న సంఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఉషారాణి ఆన్‌లైన్‌లో ఒక వస్తువు బుక్‌ చేసింది. వస్తువుకు సంబంధించిన డబ్బు ఇచ్చాక, కొరియర్‌ బాయ్‌ తిరిగి ఇవ్వాల్సిన రూ.300 ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో సదరు సంస్థ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేసింది. సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఉషారాణికి ఒక అప్లికేషన్‌ను పంపి దానిని ఫిల్‌ చేసి తమకు ఆన్‌లైన్‌ ద్వారా పంపితే మీ డబ్బులు మీకు వస్తాయన్నారు. అతను చెప్పినట్టు చేయగా.. రూ.300 రాకపోగా ఆమె అకౌంట్‌ నుంచి తొలుత రూ.91వేలు కట్‌ అయ్యాయి. ఎందుకు ఇలా జరిగిందని మరోమారు అతనికి ఫోన్‌ చేయగా.. మీరు తప్పుగా ఎంట్రీ చేశారు మళ్లీ ఫిల్‌ చేసి పంపండి.. ఇంకో అకౌంట్‌ నంబర్‌ ఇవ్వండన్నాడు. మరోసారి కూడా అలాగే పంపంగా, ఆ అకౌంట్‌ నుంచి కూడా రూ.99వేలు కాజేశాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News