Monday, December 23, 2024

ఆగస్టు 1 నుంచి గురుకుల పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ టెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుండి ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. గురుకులాల్లోని 9 కేటగిరీలలో మొత్తం 9, 210 పోస్టుల భర్తీకి గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు ఇదివరకే నోటిఫికేషన్‌లు జారీ చేసింది. ఈ పోస్టులకు మొత్తం 2 లక్షల 63 వేల 45 దరఖాస్తులు వచ్చినట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ ఆధారిత పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆగస్టు 1 నుండి 23 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల షెడ్యూల్ రెండు రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్ల వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News