Wednesday, January 22, 2025

రైళ్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైల్లో ప్రయాణాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. పెంపుడు జంతువులు కలిగిన ప్రయాణికులు ఫస్ట్ క్లాస్ ఎసి బోగీల్లో ప్రయాణించేందుకు మాత్రమే అనుమతి ఉండేది. ఇందుకోసం స్టేషన్‌లోని పార్సిల్ కౌంటర్‌కు వెళ్లి టికెట్ బుక్ చేసుకోవాలి.

సెకండ్ క్లాస్ లగేజీ, బ్రేక్ వ్యాన్ లో ఒక బాక్స్ లో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతించేవారు. ప్రయాణికుల అసౌకర్యం దృష్ట్యా రైల్వే శాఖ పెంపుడు జంతువులకు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో మార్పులు చేయాలని రైల్వే శాఖ సంబంధింత శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News