Monday, December 23, 2024

కార్‌పూలింగ్‌పై నిషేధం వైట్ నంబర్ ప్లేట్ వాహనాలకు మాత్రమే…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కార్‌పూలింగ్‌పై నిషేధం విధిస్తున్నట్టు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ప్రకటించడంతో పలువురు వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా , ఆరునెలల వరకు ఆర్సీ రద్దు అవుతుందని హెచ్చరించడంతో బెంగళూరు లోని ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.ఈ నేపథ్యంలో మంత్రి రామలింగా రెడ్డి కార్‌పూలింగ్‌పై స్పష్టత ఇచ్చారు. వైట్ నెంబరు ప్లేట్ కలిగిన ప్రైవేట్ వాహనాలకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తుందని చెప్పారు. కార్‌పూలింగ్ అంటే అదే మార్గంలో లేదా ఒకటే కార్యాలయానికి వెళ్లాల్సిన ఉద్యోగులు ఒకే వాహనంలో కలిసి ప్రయాణిస్తూ వెళ్లడం. దాంతో వారికి రవాణా భారం తగ్గుతుంది. సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. మంత్రి వైట్‌నంబర్ ప్లేట్‌కు మాత్రమే నిషేధం అని వివరించినప్పటికీ ఆ నిర్ణయం ఉద్యోగులకు ఊరట కలిగించేలా కన్పించడం లేదు. ఎందుకంటే కార్‌పూలింగ్‌లో మెజారిటీ వాటా వైట్ నంబర్ ప్లేట్ వాహనాలదే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News