Thursday, January 16, 2025

కోచింగ్‌కై దరఖాస్తుకు మరో ఐదురోజులే

- Advertisement -
- Advertisement -

మెదక్ ప్రతినిధిః షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖకు చెందిన రాష్ట్ర స్టడీ సర్కిల్‌లో సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్(పదినెలల రెసిడెన్షియల్) కోచింగ్‌కై దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ జూలై 2వ తేదీయే అని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2300 మంది దరఖాస్తు చేసుకున్నారని అందులో అత్యధికంగా (174మంది)నల్లగొండ నుంచి, వందకుపైగా మంది సూర్యాపేట(150), ఖమ్మం(130), కరీంనగర్(103), జిల్లాల నుంచి దరఖాస్తు చేసుకున్నట్లు, డ్బ్బైకి పైగా దరఖాస్తులు భద్రాద్ది, జోగులాంబ, మహబూబ్‌నగర్, మహబూబాబాద్,మంచిర్యాల, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల వచ్చాయని తెలిపారు. అతి తక్కువ దరఖాస్తులు మేడ్చల్(23), మెదక్(28), జనగాం(30), యాదాద్రి(31) జిల్లాల నుంచి తమకు నమోదయ్యాయని తెలిపారు.

రాత పరీక్షను హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్‌లలో జూలై నెల 9వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. 100 ప్రశ్నలు కలిగినజనరల్ స్టడిస్ పరీక్ష, 40 ప్రశ్నలు కలిగిన సి-శాట్‌పరీక్ష మొత్తం 140 ప్రశ్నలు కల ఈ పరీక్షను రాసేందుకు సమయం మూడుగంటలని తెలిపారు. రాత పరీక్షను అప్లై చేసిన అభ్యర్థులు తమకు అనుకూలమైన, ఎంపిక చేసుకున్న నగరం, పట్టణం నందు రాయవచ్చునని తెలిపారు. ఈ పరీక్ష ద్వారా వందమందిని ఎంపిక చేస్తామని అందులో 75 సీట్లు షెడ్యూల్డ్ కులాల వారికి, 15 సీట్లు వెనుకబడిన తరగతుల వారికి, 10 సీట్లు షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించడం జరిగిందని తెలిపారు. మొత్తంలో 33.33శాతం మహిళలకు, 5శాతం వికలాంగులకు చెందుతాయని తెలిపారు.

2022-23వ సంవత్సరంలో 18 మంది ప్రిలిమ్స్ నందు ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్ష రాసారని, అందులో ముగ్గురు ఇంటర్వూకు ఎంపికై డిల్లీకి వెళితే ఒకరికి 885వ ర్యాంకు వచ్చిందని IRS(Income Tax) లేదా IRS (Customs) పోస్టు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం మెయిన్స్ కోచింగ్ కొరకు 21 మంది ఎంపిక అయ్యారని, వారికి స్టడీ సర్కిల్‌లో కోచింగ్ ఏర్పాటుతో పాటు ఆన్‌లైన్ సబ్స్రిప్షన్లను కూడా ఏర్పాటు చేసి ఒక్కో మెయిన్స్ విద్యార్థిపైన ఒకటిన్నర లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఆశావాహులైన పట్టభద్రులు, రాష్ట్ర స్టడీ సర్కిల్ నందు ప్రవేశం పొందే ఈ అవకాశం వినియోగించుకునేందుకు ప్రవేశపరీక్షకై ఆఖరుతేదీ అయిన జూలై 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు. ఆన్‌లైన్ దరఖాస్తుకై www.tsstudycircle.co.in నందు చూసి ఆప్లై చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల స్టడి సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News