Saturday, November 16, 2024

నాలుగు రోజులే..

- Advertisement -
- Advertisement -

ఓటరు నమోదుకు మరో అవకాశం

ఇతర మార్పులకు నో ఛాన్స్ : ఇసి

మనతెలంగాణ/హైదరాబాద్ : అర్హులైన వారంతా ఓటుహక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపడుతోంది. అక్టోబరు ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకునేందుకు గత నెల 19 వరకు అవకాశం కల్పించి అక్టోబరు 4న ఓటరు తుది జాబితా ప్రకటించింది. తాజాగా శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో మరోసారి ఓటు నమోదుకు అవకాశం కల్పిం చింది. ఈ నెల ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ నెలాఖరు లోపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.

పోలింగ్ శాతం పెంపు లక్ష్యంగా.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేలా అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మరోసారి నూతన ఓటు నమోదును ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఓటరుజాబితాలో పేరు, చిరునామా, ఇతర వివరాల మార్పునకు అవకాశం కల్పించలేదు. జాబితాలో ఓటు తొలగింపునకు సైతం అవకాశం ఇవ్వలేదు. నవంబరు 30న జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరుగా నమోదు చేసుకోని వారికి ఈ నెలాఖరు వరకు గడువును ఎన్నికల సంఘం ఇచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News