- Advertisement -
న్యూఢిల్లీ : సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. అయితే ఈ నెల 30 లోగా పూర్తి చేయాల్సి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్షం చేయకండి. వాటిలో రూ.2000 నోటు మార్పిడి ఒకటి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) మే 19న 2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. 2000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వు బ్యాంక్ దేశప్రజలకు 4 నెలల సమయం ఇచ్చింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. బ్యాంకులో నోట్లను మార్చడానికి ఎలాంటి పత్రాలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఒకేసారి రూ.20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చని ఆర్బిఐ ప్రకటించింది.
- Advertisement -