Monday, December 23, 2024

200 మంది కొవిడ్ బాధితుల్లో ఒక్కరికే ఆక్సిజన్ అవసరం

- Advertisement -
- Advertisement -
Only one in 200 Covid victims needs oxygen
ఎహెచ్‌పిఐ అధ్యయనం వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. కొత్త వేరియంట్ కేసులు రెండు వేలకు సమీపించాయి. దీని ప్రభావంతో రెండో రోజూ 30 వేలకు పైగా కొత్త కొవిడ్ కేసులొచ్చాయి. అయితే ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నా కొవిడ్ బాధితుల్లో ఎక్కువ శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదని అధ్యయనాలు వెల్లడిస్తుండటం ఊరట కలిగిస్తోంది. తాజాగా అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఎహెచ్‌పిఐ) కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ప్రతి 200 మంది బాధితుల్లో ఒక్కరికి మాత్రమే ఆక్సిజన్ అందించాల్సిన అవసరం వస్తోందని పేర్కొంది. ఈ అసోసియేషన్ దేశ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2500 సూపర్ స్పెషాలిటీ, 8 వేల చిన్నస్థాయి ఆస్పత్రుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అనేక విషయాలు వెల్లడించింది. కొవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో చేరిన బాధితుల్లో 0.5 శాతం కంటే తక్కువ మందికే ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది.

అంటే ప్రతి 200 మందిలో ఒకరికి మాత్రమే ఈ అవసరం ఉంటోంది. కరోనా రెండో వేవ్ సమయంలో కంటే భిన్నమైన పరిస్థితి ఇది. కొవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినా సగటున మూడు రోజులు మాత్రమే ఆస్పత్రిలో ఉండాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా నమోదౌతున్న కేసుల్లో మహారాష్ట్ర, డిల్లీ వాటానే ఎక్కువగా ఉంటోంది. అయినా అక్కడి ఆస్పత్రుల్లో పడకల లభ్యత 90 శాతం కంటే ఎక్కువగా ఉందని ఎహెచ్‌పిఐ వెల్లడించింది. మహారాష్ట్రలో దాదాపు 9 నుంచి 10 శాతం పడకలు మాత్రమే నిండుతుండగా, ఢిల్లీలో 10 శాతం లోపే ఉందని అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ జె జ్ఞాని తెలిపారు. కొన్ని మెజారిటీ ఆస్పత్రులు సొంత ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయని తెలిపింది. ఇప్పటివరకు ఆక్సిజన్ అందించాల్సిన అవసరం 0.5 శాతం మాత్రమే. ఇది 5 శాతానికి మించినప్పుడు, పడకల ఆక్యుపెన్సీ 30 శాతం దాటినప్పుడు మేం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తాం అని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News