మనతెలంగాణ/హైదరాబాద్ : ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూ పొందించిన బిల్లులో గవర్నర్ తమిళిసై సౌం దరరాజన్ లేవనెత్తిన అభ్యంతరాలకు ప్రభుత్వం శనివారం వివరణ ఇచ్చింది. రెండుసా ర్లు గవర్నర్ ఈ బిల్లుకు సంబంధించి పలు అంశాలకు సంబంధించి వివరణను కోరగా వెనువెంటనే స్పందించిన ప్రభుత్వం వాటికి సమాధానాలు పంపింది. ముందుగా గవర్నర్ ఈ బిల్లుకు సంబంధించి ఆర్‌టిసి ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌కు న్యాయం ఎలా చేస్తారు? ఉ ద్యోగుల ప్రయోజనాలను ఎలా కాపాడతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛను ఇస్తారా? ఆర్టీసిలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు, విభజన చట్టం ప్రకారం ఆర్టీసి స్థితిని మార్చడానికి సంబంధించి వివరాలు తెలపాలని గవర్నర్ ప్రభుత్వా న్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం దానిపై శనివారం మధ్యాహ్నానికి వివరణ ఇచ్చింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని ఆర్టీ సి సంస్థ యధావిధిగా కొనసాగుతుందన్నారు.
కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల అవసరం లేదు
కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవస రం లేదని ప్రభుత్వం తెలిపింది. కార్పొరేషన్‌గా కొ నసాగుతున్నందున విభజన చట్టానికి ఇబ్బంది లే దని ప్రభుత్వం పేర్కొం ది. ఉద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని, బి ల్లు ప్రధాన ఉద్దే శం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పిం ఛన్లు, త దితరాలకు సంబంధించి ఎలాంటి అయోమయం లేదని ప్రభుత్వంలోకి తీసుకున్న తర్వాత వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. వేతనాలు, జీతాలు, కేడర్, పదోన్నతుల కు ఎలాంటి సమస్య ఉండదని కూడా వివరించింది. అన్ని అంశాలపై వి వరణ ఇచ్చినందున ఆర్టీసి బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను ప్రభుత్వం కోరింది.
రెండోసారి వివరణ కోరిన గవర్నర్
అయితే మొదటిసారి ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని గవర్నర్ మరో కొన్ని అంశాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. గవర్నర్ అడిగిన పలు అంశాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వం వాటా 30శాతం ఉ న్నందున కేంద్ర సమ్మతి పొందారా? లేదా? అన్న విషయాన్ని వివరించాలి. ఒకవేళ సమ్మతి పొందితే దానికి సంబంధించి ఉత్తర్వులను ఇవ్వాలి. లేదం టే చట్టబద్ధత పాటించేలా తీసుకున్న చర్యల గురిం చి తెలపాలని గవర్నర్ కోరారు. సంస్థలోని శాశ్వ త, తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను కేటగిరీలు, డి పోల వారీగా మొత్తం వివరాలు అందించాలని గ వర్నర్ సూచించారు. కాంట్రా క్టు, క్యాజువల్, ఇత ర ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య కూ డా కావాలని గవర్నర్ కోరారు. తాత్కాలిక ఉద్యోగుల కోసం తీసుకునే చర్యలతో పాటు భూములు, భవనాలు తదితర ఆర్టీసి స్థిర, చరాస్థులు కార్పొరేషన్‌లోనే కొనసాగుతాయా? లేక వాటిని ప్రభు త్వం స్వాధీనం చేసుకుంటుందా? అని గవర్నర్ తమిళి సై ప్రశ్నించారు. దీంతోపాటు బస్సులను నడిపే బాధ్యత ఎవరిదని గవర్నర్ అడిగారు ? ప్రభుత్వ ఉద్యోగులుగా మా రిన తర్వాత నిర్వహణ బాధ్యత ఎవరిదని, ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికుల ప్రయోజనాల పరిరక్షణలో కార్పొరేషన్ పాత్ర వివరా లు ఇవ్వాలని గవర్నర్ కోరారు. ఆర్టీసి ఉద్యోగులు ప్రభు త్వ సర్వీసులో చేరిన తరువాత వారు సంస్థలో డిప్యూటేషన్‌పై పనిచేస్తారా లేక ఇతర ఏర్పాట్లు చేస్తారా అని గవర్నర్ ప్రశ్నించారు. ఈ అంశాలపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు. బిల్లుపై నిర్ణయం తీసుకోవాలంటే ఈ వివరణలు ఉపయోగపడుతాయని గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్ రెండోసారి కోరిన వివరణలకు సమాధానం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పంపింది.
ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బిల్లును…
ఆర్టీసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తి స్తూ ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుం ది. అందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు యుద్ధ ప్రాతిపదికన బిల్లు ను రూపొందించి సాంకేతికపరంగా ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించింది. అయితే ఆ బిల్లుకు గవర్నర్ తమిళిసై అనుమతి ఇవ్వలేదు. తనకు పలు సందేహాలు ఉన్నాయని వాటిపై వివరణ ఇవ్వాలని కోరింది.