Thursday, January 23, 2025

బిజెపిని ఓడించేది రెండో ఫ్రంటే: ప్రశాంత్ కిశో్ర్

- Advertisement -
- Advertisement -

Prashant Kishore

న్యూఢిల్లీ:  బిజెపిని కనుక ఓడించాలనుకుంటే రెండో ఫ్రంట్‌గా ముందుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని…దేశంలో మూడో ఫ్రంటో, నాలుగో ఫ్రంటో ఎన్నికల్లో విజయం సాధించలేదని  ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ‘2024 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టిఎంసి థర్డ్ ఫ్రంట్‌గా అవతరించేందుకు మీరు సాయం చేస్తున్నారా?’ అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని తాను అనుకోవడం లేదని, బిజెపిని తొలి ఫ్రంట్ అనుకుంటే కనుక అప్పుడు దానిని ఓడించేందుకు రెండో ఫ్రంట్ మాత్రమే ఉండాలని అన్నారు. బిజెపిని ఓడించాలని అనుకునే ఏ పార్టీ అయినా అది రెండో ఫ్రంట్‌గా మాత్రమే ఉండాలని పేర్కొన్నారు.

అలాంటప్పుడు మరి కాంగ్రెస్‌ను రెండో ఫ్రంట్‌గా భావిస్తారా? అన్న ప్రశ్నకు ‘కాదని’ సమాధానం చెప్పారు. కాంగ్రెస్ దేశంలోని రెండో అతిపెద్ద పార్టీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ‘భవిష్యత్తులో బిజెపిని ఎదుర్కొని కాంగ్రెస్ నిలబడగలదా?’ అన్న ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ బలంగా వేళ్లూనుకుపోయిన పార్టీ అని, ఆ పార్టీకి అవకాశాలు లేవని చెప్పడం తప్పే అవుతుందన్నారు. అయితే, ఆ పార్టీలో కొన్ని మార్పులు అవసరమన్నారు. 2024లో మోడీని మార్చేదెవరో తనకు తెలియదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలను బట్టి లోక్‌సభ ఎన్నికలను అంచనా వేయలేమని ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News