Thursday, January 23, 2025

ఏజన్సీ ప్రాంతంలో గిరిజన టీచర్లకు మాత్రమే పదోన్నతులు ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

మనతెంగాణ/హైదరాబాద్ : ఏజన్సీ ప్రాంతంలో గిరిజన ఉపాధ్యాయులకు మాత్రమే పదోన్నతులు, నియామకాలు చేపట్టాలని, ఏజన్సీ మైదాన ప్రాంతాలకు వేరు వేరుగా బదిలీలు పదోన్నతులు చేపట్టాలని ట్రైబల్ టీచర్స్ యూనియన్స్ జెఎసి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావుకు విజ్ఞప్తి చేసింది. సోమవారం ఎంఎల్‌ఎలు రేగా కాంతారావు, అత్రం సక్కులతో కలిసి టిటియుజెఎసి నాయకులు మంత్రి కెటిఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

జీఓ నెం.3పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ వేసి వుందని,దానికి లోబడి ఏజెన్సీలో ఉన్న పదోన్నతులను స్థానిక గిరిజన ఉపాధ్యాయులకు షరతులపై పదోన్నతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని కెటిఆర్ హామీ ఇచ్చారని జెఎసి నాయకులు పేర్కొన్నారు. మంత్రి కెటిఆర్‌ను కలిసినవారిలో జెఎసి రాష్ట్ర కన్వీనర్లు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్,కల్లూరి జయబాబు,మోకాళ్ల శ్రీనివాస్ రావు, మాలోత్ రామారావు రాష్ట్ర కో-కన్వీనర్లు కబ్బాకుల రవి, లకావత్ శర్మన్,మెస్రం గంగారాం,గణేష్ రాథోడ్, జెఏసి నాయకులు బీజ్జ శ్రీనివాస్,బానోత్ ఈరు,పునెమ్ సారయ్య,సింగం రవి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News