మనతెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారికి మాత్రమే చెన్నై సబ్‌అర్బన్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని దక్షిణ రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. ఈ నిబంధనలు జనవరి 10వ తేదీ నుంచి 31వ తేదీవరకు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. తమిళనాడులో కొవిడ్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న క్రమంలో దక్షిణమధ్య రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి మాత్రమే సబ్‌అర్భన్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని దక్షిణమధ్య రైల్వే స్పష్టం చేసింది. అంతేకాక దక్షిణమధ్య జోన్‌లోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో మాస్కు లేకుండా కనిపిస్తే రూ. 500 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికులు కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని అధికారులు సూచించారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా జనవరి 6వ తేదీ నుంచే దక్షిణ రైల్వే జోన్ పలు రకాల ఆంక్షలను విధిస్తుండగా, జనవరి 6వ తేదీ నుంచి రైళ్లను 50 శాతం సీటింగ్ సామర్థ్యంతోనే నడుపుతోంది.