Thursday, December 26, 2024

బిఆర్‌ఎస్‌తోనే పల్లెల ప్రగతి.. పేదల సంక్షేమాలు

- Advertisement -
- Advertisement -

తెలకపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, పల్లెల ప్రగతి సాధ్యమవుతుందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బొప్పల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బిచ్చలు, సీనియర్ నాయకులు కొండలరావు, సురేంద్ర రావు, నాగుల రావు ఆధ్వర్యంలో 60 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదే విధంగా గట్టురావిపాకుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్ల ఎర్రయ్య, పి. సుధాకర్, ఎస్. సురేష్, ఎస్.లింగస్వామి, సి. నాగరాజు, సి. నాగశేషు, శివతో పాటు పలువురు కార్యకర్తలు 30 మంది ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వల్ల పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాలలో మౌళిక సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఇటీవల విద్యుత్ ప్రమాదానికి గురైన బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి కొమ్ము మధు, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ మాధవరం హనుమంత రావు, రైతు బంధు మండల అధ్యక్షులు జి. మాధవ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కోట్ల శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ చింత పరుశ రాములు, ఎంపిటిసిలు, గ్రామ సర్పంచులు, మండల, గ్రామ పార్టీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News