Monday, January 20, 2025

వైభవంగా ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవ ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేకం, సాయంత్రం ఆలయ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ మహోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసిన అర్చకులు మేళతాళాలు, మంత్రోచ్ఛరణ గావిస్తూ అమ్మవారి సేవను ఆలయ పురవీధులలో ఊరేగించారు. అద్దాల మండపములో అమ్మవారి సేవను వేచింప చేసి ఊంజల్ సేవ ప్రత్యేకతను అర్చకులు భక్తులకు వివరించారు. భక్తజనులు అమ్మవారిని దర్శించుకొని తరంచారు.

శ్రీవారి నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శుక్రవారం  రూ.31,85,920 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,76,150, బ్రేక్ దర్శనం ద్వారా రూ.3,01,200, వ్రత పూజల ద్వారా రూ.72,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ.1,80,000, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.4,00,000, ప్రసాద విక్రయం ద్వారా రూ.10,63,080, తదితర శాఖల నుంచి ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీ స్వామివారిని దర్శించుకున్న స్వామీజీ..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని గుజరాత్ రాష్ట్రంకు చెందిన గోస్వామి గోవిద్రైజీ స్వామీజీ దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారిని దర్శింకున్న స్వామిజి ప్రత్యేక పూజలను నిర్వహించగా ఆలయ అర్చకులు శ్రీ స్వామివారి ఆశీర్వచనము అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News