Monday, December 23, 2024

అర్హులందరికీ ఇంటి స్థలాలు వచ్చేందుకు కృషి: అల్లం నారాయణ

- Advertisement -
- Advertisement -

అర్హులందరికీ ఇంటి స్థలాలు వచ్చేందుకు కృషి

రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

journalist housing society members met Allam Narayana

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హామీ ఇచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని ది జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ స భ్యులు (పూర్వ 2000 సంవత్సరం) స్టీరింగ్ కమిటీ బృందం ఆధ్వర్యంలో అకాడమీ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రాధాన్యత ప్రాతిపదికన మెంబర్ షిప్ సీనియారిటీ, వయస్సు, వృత్తిపరమైన సీనియరిటీని పరిగణనలోకి తీసుకోవాలని, తక్షణమే ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మా ట్లాడుతూ ఇంటి స్థలాల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయమే కీలకమైనదని, ఆ దిశగా తమ వంతు ప్ర యత్నాలు చేస్తామని స్పష్టం చేశారు. అర్హత కలిగిన వారికి నిబంధనల ప్రకారం స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. ముఖ్యంగా సొసైటీలలో సీనియర్ సభ్యులుగా ఉంటూ వివిధ కారణాల వల్ల ప్లాట్లు పొందలేకపోయిన వారి ప్రతిపాదనలను పరిశీలించేందుకు అభ్యంతరం ఉండబోదని తెలియజేశారు.

అత్యంత సీనియార్టీ కలిగిన జర్నలిస్టులతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు సొసైటీలలో సభ్యత్వం లేని వారికి కూడా స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సీనియర్లుగా ఉన్నవారికి ఇంకా స్థలాలు రాకపోయినప్పటికీ, వారి డిమాండ్ సమచితమైనదేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ పలు అంశాలను చైర్మన్ నారాయణ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. ది జర్నలిస్ట్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్‌లో అడ్మిషన్ నెంబర్ 1 నుంచి 1235 వరకు సభ్యత్వం ఉన్నవారికి వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని వారు కోరారు.

ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికను ప్రస్తావించామని వెల్లడించారు. మానవతా దృక్పథంతో 2000 సంవత్సరం జూన్ 7వ తేదీ కన్నా ముందు జూబ్లీహిల్స్ సొసైటీలో వెయిటింగ్‌లో ఉన్న వారందరికీ ప్లాట్ల ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు టి. సుధాకర్, పి. హేమంత్‌కుమార్ , బి. రవీందర్, వి. వీరాంజనేయులు, బివి మహీధర, కె.వెంకటరత్నం, కె. శివప్రసాద్, బాలరాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News