Saturday, December 28, 2024

హస్తవ్యస్తం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  కాంగ్రెస్‌లో పిసిసి కమిటీల నియమాకంతో చెలరేగిన చిచ్చు మరింతగా ముదిరింది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకమయ్యారు. రేవంత్ సారథ్యంలోని పిసిసి కమిటీలు వాస్తవ కాంగ్రెస్ కాదం టూ సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘సేవ్ కాంగ్రెస్’ నినాదంతో ఎఐసిసి ముం దు తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అస లు కాంగ్రెస్ నాయకులకు పార్టీలో అన్యాయం జరుగుతుందనే వాదన వినిపించారు. దీంతో వలస వచ్చిన నాయకులు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాదులుగా పరిస్థితి మారిందనే చెప్పా లి. ఇందుకు శనివారం సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సీనియర్ నేతల సమావేశం వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సిం హ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధుయాష్క్లితో పాటు ప లువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.

ఈ సమావే శం అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా ఆయనపై కా మెంట్స్ చేశారు. అలాగే ఈ సమావేశం లో పిసిసి నిర్వహించే ఏ సమావేశానికి కూ డా హాజరు కాకూడదని నేతలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం ఎఐసిసి కా ర్యక్రమాల అమలుపై పిసిసి సమావేశం పెట్టిన బహిష్కరిం చాలనే ఆలోచనలో ఉన్నట్టుగా స మాచారం. అలాగే మంగళవారం మరోసారి సమావేశం కావాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ సమావేశం లో జిల్లాలకు చెందిన కొం దరు సీనియర్ నేతలను భాగస్వామ్యం చే యాలనే వారు ఉన్నట్టుగా తెలుస్తోం ది. మరోవైపు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్ వైఖరిపై కూడా ఈ సమావేశంలో చ ర్చించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. మం గళవారం జరిగే సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వారి అజెండాను ఖరారు చేసే అ వకాశం ఉంది.

ఇదిలా ఉండగా శనివారం భ ట్టి నివాసంలో జరిగిన సమావేశం అనంతరం నేతలు మాట్లాడుతూ ఒరిజినల్ కాంగ్రెస్ నినాదంతో వలస వచ్చిన నేతల వల్ల పార్టీ నమ్ముకున్న వాళ్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉమ్మడి గళం వినిపించారు. పిసిసి కమిటీల్లో బయటి నుంచి వచ్చినవారికే ముఖ్యంగా టిడిపి నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ పదవులు దక్కాయని చెప్పారు. రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించనప్పటికీ వలస నాయకుడు, నాలుగు పార్టీలు మారిన వ్యక్తి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఉద్దరిస్తారా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికో, ఇంకొకరికి అప్పజెప్పాలనో కుట్ర జరుగుతుందని కూడా ఆరోపించారు. సోష ల్ మీడియా పోస్టులతో కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్న నాయకులపై కోవర్టులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తాము కాంగ్రెస్‌లోనే పుట్టామని, కాంగ్రెస్‌లోనే ఉన్నామని, కాంగ్రెస్‌లోనే చస్తామని నేతలు స్పష్టం చేశారు. అసలైన కాంగ్రెస్‌వాదులకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని అందుకే సేవ్ కాంగ్రెస్ కార్యక్రమంతో ముందుకు వెళ్లనున్నట్టుగా ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన పిసిసి ఎగ్జిక్యూటివ్, జిల్లా కమిటీల నియామకానికి సంబంధించి సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు బాహాటంగానే తమ నిరసనను తెలియజేశారు. రేవంత్ నిర్ణయాలను వీరంతా మూకుమ్మడిగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
సామాజిక న్యాయం జరిగిందంటున్న రేవంత్ వర్గం
పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విడుదల చేసిన వివిధ కమిటీలలో టిడిపి నుంచి పార్టీలోకి వచ్చిన వ్యక్తుల జాబితాను ప్రకటించారు. పిసిసి కమిటీ ప్రకటించిన 22 మందిలో టిడిపి నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి తప్ప ఎవరూ లేరని స్పష్టం చేశారు. పిఇసి కమిటీలో 40 మంది ఉండగా టిడిపికి చెందిన వారు ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలిపారు. ప్రస్తుత కమిటీలలో సామాజిక న్యాయం జరిగిందన్నారు.
మేము ఒరిజనల్ కాంగ్రెస్ : ఉత్తమ్
కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కొన్ని విషయాలు చాలా బాధ కలిగించాయన్నా రు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఉంటుందన్నారు. తాను పిసిసిగా ఉన్నప్పుడూ తనను ఇష్టపడినవారు, వ్యతిరేకించిన వారు ఉన్నారని చెప్పారు. అయితే ఏ రోజు కూడా తానే అన్ని పోస్టుల్లో ఉండాలనే ఆలోచన చే యలేదని తెలిపారు. తానే కాంగ్రెస్ పార్టీని క్యాప్చర్ చేసుకోవాలని ఆలోచన చేయలేదని, వ్యతిరేకిం చిన వారిని పార్టీలో ఎదగకుండా చేయాలని అనుకోలేదని చెప్పారు. కొంతమందిని అవమానించడానికే డిసిసిల ప్రకటన జరిగింద ని భావిస్తున్నట్టుగా చెప్పారు.

33 జిల్లాల్లో.. 26 డిసిసిలను ప్రకటించి, 7 మా త్రమే ఆపారని, ఎందుకంత హడావుడిగా చేశారో అర్థం కాలేదన్నారు. గెలిచే చోట డిసిసిల నియమాకాన్ని ఆపారన్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శు ల్లో ఎక్కువ మంది బయటి పార్టీ నుంచి వచ్చిన వారు ఉన్నారన్నారు. కానీ చా లా కాలంగా పార్టీలో ఉన్నవారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉం దని చెప్పారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్లో.. 50 మందికి పైగా టిడిపి నుంచి వచ్చినవాళ్లే ఉన్నారని అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసి వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఏదో కుట్ర జరుగుతోంది : భట్టి
పిసిసి కమిటీల కూర్పులో తాను పాలు పంచుకోలేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అందుకే తనను కలిసేవారికి న్యాయం చేయలేకపోతున్నట్లు వెల్లడిం చారు. ఈ విషయంలో మనస్తాపానికి గురవుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకు చొరవ చూపాల్సిన అవసరంఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న నాయకులపై సోషల్ మీడియాలో దుష్ప్రచా రం చేస్తున్నారని, ఇది ఏడాదిన్నరగా జరుగుతోందని ఆక్షేపించారు. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతోందనే భావన కలుగుతోందని భట్టి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నాయకులకు, వలసవాదులకు పోరాటం: మధుయాష్కీ
మాజీ ఎంపి మధుయాష్కీ మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ నాయకులకు, వలస వచ్చిన వారికి మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. కమిటీల విషయంలో పిసిసి అధ్యక్షుడితో సమానంగా ఉండే సిఎల్‌పి నేతనే భాగస్వామ్యం చేయడం లేదని, ఆయనకే అన్యాయం జరుగుతోందన్నారు. కుట్ర పూరితంగా కాంగ్రెస్‌ను నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బయట నుంచి వచ్చిన వారికి తమను ప్రశ్నించే స్థాయి లేదని స్పష్టం చేశారు. .
మమ్ములను కోవర్టులుగా ముద్ర వేస్తారా? : జగ్గారెడ్డి
కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న నేతలంతా సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నవాళ్లేనని ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కోసం అందరం పనిచేశామన్నారు. అలాంటి తమను కోవర్టులుగా ముద్ర వేస్తారా? అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది : రాజనర్సింహ
కాంగ్రెస్‌లో ఉన్న ఒరిజినల్ నేతలు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని దామోదర రాజనర్సింహా అన్నారు. మొదట్నించీ ఉన్నవారిని కాపాడుకోవాలన్నదే తమ ఆవేదన అని తెలిపారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కమిటీల్లో ఎక్కువగా అవకాశం కల్పించారన్నారు. ‘మేం నాలుగు పార్టీలు మారి వచ్చిన వాళ్లం కాదు. ‘ఇక్కడే ఉంటాం.. ఇక్కడే చస్తాం’ అని వ్యాఖ్యానించారు.
భట్టికి కోమటిరెట్టి ఫోన్.. మీ వెంటే ఉంటానని వెల్లడి
మరో వైపు సీనియర్ల సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాలేదు కానీ ఆయన భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
సీనియర్లకు హైకమాండ్ నుంచి పిలుపు
ఇదిలా ఉండగా, తెలంగాణలో పార్టీ పరిస్ధితి నానాటికీ దిగజారిపోతుండటం, కుమ్ములాటలు మరింత ఎక్కువ కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. దీనిలో భాగంగా సీనియర్ నేతలందరినీ ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో అధిష్టానం వద్దే తాడోపేడో తేల్చుకోవాలని సీనియర్లు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం పార్టీలోనే నెలకొన్న వాస్తవ పరిస్ధితులను ముక్తకంఠంతో అధిష్టానానికి వినిపించే యోచనలో సీనియర్లు వున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News