Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

కుంటాల : ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలే పార్టికి శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు కలిసి కట్టుగా సైనికుల్లా పని చేయాలని అన్నారు. గ్రామాల్లో పార్టీకార్యకర్తలు ప్రభుత్వం ప్రవేశపెడుతన్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు.

కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారని అన్నారు. అద్భుతమైన పథకాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. రైతులకు రైతుబీమా, రైతుబంధుతో పాటు24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గంగామణి బుచ్చన్న, బిఆర్‌ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, స్థానిక సర్పంచ్ సమత వెంకటేష్, మార్క్‌పెడ్ డైరెక్టర్ గంగాచరణ్, టౌన్ ప్రెసిడెంట్ రమేష్, సర్పంచ్‌లు దా సరి కిషన్, ఎండీ హైమద్, పెద్దకాపు మల్లేష్, సోషల్ మీడియా వర్కింగ్‌‌ర పెసిడెంట్‌పెంటవార్ ధశరత్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు,ఎంపిటిసిలు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News