- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఈ నెల 26న మంచిరేవులలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. మంచి రేవులలో కార్యక్రమ ఏర్పాట్లను శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పార్కులో మొక్కలు నాటనున్నారు. ఒక రోజు, కోటి మొక్కలు రాష్ట వ్యాప్తంగా నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక్కడి నుంచి ప్రారంభించనున్నారు.
- Advertisement -