Thursday, January 23, 2025

అబూ ధాబిలో హిందు ఆలయం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కార్యక్రమం

అబూ ధాబి : అబూ ధాబిలో హిందు పద్ధతిలో నిర్మించిన తొలి రాతి ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభోత్సవం చేశారు. స్వామినారాయణ్ తెగ ఆధ్యాత్మిక నేతల సమక్షంలో ప్రార్థనల మధ్య ప్రధాని మోడీ ఆలయాన్ని ప్రారంభించారు. లేత గులాబీ పట్టు ధోవతి, కుర్తా, చేతులు లేని జాకెట్, ఉత్తరీయం ధరించిన ప్రధాని మోడీ ఆలయాన్ని ప్రజలకు అంకితం చేయడానికి ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ప్రధాని ‘ప్రపంచ హారతి’ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బిఎపిఎస్) నిర్మించిన ప్రపంచవ్యాప్తంగా గల స్వామినారాయణ్ తెగకు చెందిన 1200 పైచిలుకు ఆలయాలలో ఒకేసారి ‘హారతి’ కార్యక్రమం జరిగింది. అబూ ధాబిలో తొలి హిందు రాతి ఆలయం నిర్మాణానికి కృషి చేసిన వివిధ మత విశ్వాసాలకు చెందినవారిని మోడీ కలుసుకున్నారు. దుబాయి=అబూ ధాబి షేఖ్ జాయెద్ హైవేపై అల్ రహ్‌బా సమీపంలో అబూ మరైఖాహ్‌లో 27 ఎకరాల స్థలంలో సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆలయానికి వెళ్లే ముందు ప్రధాని మోడీ ఆలయంలోని వర్చువల్ గంగా, యమునా నదులలో నీరు విడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News