Friday, January 24, 2025

సిద్దిపేట జిల్లా సదర్ ఖాజీ కార్యాలయం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సదర్ ఖాజీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని మాజీ ఉర్డూ బోర్డు డైరెక్టర్ కలీముర్ రెహమాన్ అన్నారు. బుధవారం ముస్లిం సమాజానికి చెందిన వివాహాలను జరిపించి వారికి అధికారికంగా సర్టిఫికేట్లు ఇవ్వడానికి పట్టణంలోని బారాఇమాం చౌరస్తాలో ఏర్పాటు చేసిన సదర్ ఖాజీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారిగా జిల్లా సదర్ ఖాజీగా జహిరుద్దిన్‌ను ప్రభుత్వం నియమించిందన్నారు. అంతకు ముందు మత పెద్దలు అబ్ధుల్ సమీ అరబ్బీ శ్లోకంర్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముర్షద్ గడ్డ దర్గా పీఠాదిపతి హకీమ్ చిష్తి, సిద్దిపేట తాంజముల్ మసాజిత్ అద్యక్షులు ఆజాం ఆలీ జావేద్, ముప్తి అబ్ధుల్ , సలామ్ ఖాస్మి, ముప్తి మసూద్ ,ఆలం ఖాస్మి, ఇక్బాల్ ఆశ్రపీ, టిఆర్‌ఎస్ మైనార్టీ జిల్లా అద్యక్షుడు ఫక్రుద్దిన్, అడ్వకేట్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News