దండేపల్లిః గ్రామాల్లో చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్‌స్కూల్ ఒక వరమని ఎస్సై మచ్చ సాంబమూర్తి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఆదివారం ఓపెన్ పదవ తరగతి అభ్యాసన తరగతులను ఆయన పరిశీలించి కొత్తగా చేరిన అభ్యాసకులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనివార్య కారణాలతో మధ్యలో చదువు మానేసిన వారికి ఓపెన్ 10వ తరగతి, ఇంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
చదువు మానేసిన వారు ఓపెన్‌స్కూల్‌ను సద్వినియోగం చేసుకుని 10, ఇంటర్‌లో ఉత్తీర్ణులు కావాలన్నారు. ఓపెన్ 10, ఇంటర్‌లు రెగ్యులర్ విద్యతో సమానమని, తరగతులకు హాజరై అధిక మార్కులు సాధించాలని అభ్యాసకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు, ఓపెన్‌స్కూల్ సమన్వయకర్త వరలక్ష్మి, సహాయ సమన్వయకర్త సంగర్ష్ రాజేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రవీందర్, రామన్న, కొండు జనార్దన్, అభ్యాసకులు పాల్గొన్నారు.