Monday, December 23, 2024

ఆపరేషన్ బిజెపి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో కొద్ది రో జుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నా యి. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్న నేతలు తుది నిర్ణయం తీసుకునే పనిలో పడ్డారు. దీంతో రాజకీయ వలసలు ఊ పందుకున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష బిఆర్‌ఎస్ నుంచి పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్, బిజెపిలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరగా, నాగర్ కర్నూల్ ఎంపీ పి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కమలం కండు వా కప్పుకుని బిజెపి ప్రకటించిన మొదటి జాబితాల్లో ఎం పి టికెట్లు సంపాదించుకున్నారు. రాష్ట్రంలో ఇంకో ఎనిమి ది పార్లమెంటు స్థానాల్లో బిజెపి తమ పార్టీ అభ్యర్థులను ప్ర కటించాల్సి ఉంది. ఇందులో మహబూబ్‌నగర్ స్థానానికి డికె అరుణ, జితేందర్‌రెడ్డి పోటీ పడుతుండగా, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్ స్ధానాల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులను ఢీకొనే నేతలకు కమలనాథులు గాలం వేస్తున్నారు.
ముగ్గురు బిఆర్‌ఎస్ నేతలతో కమలం మంతనాలు…
ఖమ్మం బిఆర్‌ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావుతో బిజెపి నేతలు పార్టీ మార్పుపై టచ్‌లోకి వెళ్లారని, చర్చల్లో స్థానిక రాజకీయ పరిస్థితుల దరిమిలా ఆయన ఆపార్టీలో చేరి ఇక్కడి నుంచి తిరిగి కమలం అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో నామా బిజెపిలో చేర్చేకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడు లోక్ సభ స్థానం నుంచి కూడా బలమైన అభ్యర్ధి లేకపోవడంతో సీనియర్ బిఆర్‌ఎస్ నేత మాజీ ఎంపి సీతారాంనాయక్‌ను కమలనాథులు తమ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే బిజెపి నేతలు, ఆయన మధ్య చర్చలు జరిగాయని, ఆశించినట్లు టికెట్‌కు హామీ ఇస్తే సీతారాంనాయక్ బిజెపిలో చేరడం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కమలం గుర్తుపై ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంటుందని అనుచరులు చెబుతున్నారు. 2014 లో సీతారాంనాయక్ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. వీరితో పాటు వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎంపిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా రు. దీనిని పసిగట్టిన బిజెపి నేతలు ఆయనతో చర్చలు జరిపి పార్టీలోకి తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. వీరితో పాటు నల్లగొండ స్థానం బిసి అభ్యర్ధి మన్నెం రంజిత్‌యాదవ్ పోటీ చేసేందుకు మొగ్గు చూపుతుండగా అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి జానారెడ్డి కుటుం బ పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ నుంచి ఆశిస్తున్న పటేల్ రమేష్ రెడ్డిపై కమల నాథులు కన్నేశారు. ఆయన తమ పార్టీలోకి లాగేందుకు ఆయన అనుచరులతో మాట్లాడుతున్నట్లు సమాచారం.

అదే విధంగా పెద్దపల్లి నుంచి ఎంపి టికెటు వస్తుందని బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతకాని వెంకటేష్ ఆపార్టీ సీటు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ నుంచి వివేక్ కుమారుడు గడ్డం వంశీకే దక్కుతుందని ప్రచారం అవుతుండటంతో వెంకటేష్ కూడా బిజెపి గూటికి వచ్చే అవకాశం ఉందని నియోజకవర్గం నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావుకు టికెట్ దక్కడం కష్టమేనని ప్రచారం జరుగుతుండటంతో ఆయన స్దానంలో మాజీ ఎంపి నాగేష్‌ను పార్టీలో చేర్చుకుని బరిలో నిలిపేందుకు బిజెపి ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా 10 సీట్లలో విజయం సాధించే దిశగా కమలం పెద్దలు వ్యుహాలు రచిస్తున్నట్లు తెలిసింది. బలమైన నేతలు చేర్చుకునేందుకు రాష్ట్ర నేతలు శ్రమిస్తున్నట్లు ద్వితీయ -శ్రేణి నాయకులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News