Monday, January 20, 2025

కర్నాటకలో ఆపరేషన్ హస్త: బిజెపి ఎమ్మెల్యేలకు వల

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో బిజెపి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ దెబ్బకు అధికారాన్ని కోల్పోయిన బిజెపి కాంగ్రెస్ చేపట్టినట్లు చెబుతున్న ఆపరేషన్ హస్త లేదా రివర్స్ ఆపరేషన్ లోటస్ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడ్యూరప్ప ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగిన ఒక కీలక సమావేశానికి ఇద్దరు ప్రముఖ బిజెపి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరనున్నారంటూ సాగుతున్న ఊహాగానాలకు తెరదించడానికి ఎడ్యూరప్ప ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సామవేశానికి బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్‌టి సోమశేఖర్, మరో ఎమ్మెల్యే బైరతి బసరవరాజ్ గార్హాజరయ్యారు. వీఇరద్దరూ బెంగళూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరికీ సొంతంగానే గెలిచే సత్తా ఉంది. కాగా..సోమశేఖర్ ఇటీవల పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ను తన రాజకీయ గురువుగా పేర్కొంటూ ఆయనపై ప్రశంసలు గుప్పించడం విశేషం.

బసవరాజ్‌ను తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డికె శివకుమార్ మధ్య విభేదాలు పొడసూపినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని కెఆర్ పురం స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బసవరాజ్ మంచి ఆర్థిక పుష్టి ఉన్న నాయకుడు. కాంగ్రెస్‌లోకి ఆయనను తిరిగి చేర్చుకోవడానికి శివకుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

యడ్యూరప్ప నివాసంలో శుక్రవారం ఈ సమావేశం జరిగింది. పార్టీలో అంతా సవ్యంగానే ఉందని యడ్యూరప్ప సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ సమావేశాన్ని హాడవుడిగా ఏర్పాటు చేయవలసి వచ్చిందని, అందుకే అందుబాటులో లేని కొందరు నాయకులు రాలేకపోయారని ఆయన తెలిపారు.బిజెపిని ఎవరూ వీడటం లేదని, అందరూ తమతోనే ఉన్నారని ఆయన చెప్పారు. కొన్ని విషయాలలో ఒకరిద్దరు నాయకులకు ఆందోళన ఉందని, వారితో నేరుగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేస్తానని యడ్యూరప్ప చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీసిందని, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని యడ్యూరప్ప ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిపోయిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగస్టు 23న బెంగళూరులో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతాయని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా బిజెపి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికా పరేషన్ హస్త చేపట్టాలని కాంగ్రెస నిర్ణయించుకున్నట్లు వర్గాలు తెలిపాయి. బిజెపి, జెడిఎస్‌కు చెందిన 15 మందికి పైగా ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవాలని కాంగ్రెస భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బిజెపి, జెడిఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు మంతనాలు సాగిస్తున్నారని వారు తెలిపారు.

కాగా..రాజకీయాలలో ఏదైనా సాధ్యమైనంటూ ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ శుక్రవారం వ్యాఖ్యానించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News