Sunday, November 17, 2024

ఆపరేషన్ హిమాయత్‌సాగర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: చెరువుల్లోని నిర్మాణాలనే కాదు. హైదరాబాద్ నగర శివారులోని జంట జలాశయాల చుట్టూ వెలిసిన అక్రమ లేఅవుట్లు, ఫాం హౌస్‌లు, కట్టడాలపైనా హైడ్రా కొరడా ఝళిపించేందుకు రంగం సి ద్దంచేస్తుంది. గత రెండు రోజుల క్రితం ఉస్మాన్‌సాగర్(గండిపేట్) పరిధిలో కూల్చివేతలు చేపట్టడంతో బడాబాబుల్లో వణుకు మొదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉ స్మాన్ సాగర్‌తో పాటు హిమాయత్‌సాగర్ జలాశయం పరిసర ప్రాంతాల్లో వెలిసిన లేఅవుట్లు, నిర్మాణాలపై చర్య లు తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనేది ప్రచారంసాగుతోంది.చారిత్రాత్మకమైన హిమాయత్‌సాగర్ పరివాహక ప్రాంతాల్లో ఏలాంటి కట్టడాలు చేపట్టరాదనే నియమనిబంధనలు అమలులో ఉన్నప్పటికీ సంపన్న వర్గాలు ఎకరాలకొద్దీ భూములు కొనుగోలుచేసి విలాసవంతమైన అతిథి భవనాలను అనుమతులు లేకుండానే నిర్మించుకున్నారనేది బహిరంగ రహస్యం.

ఈ అక్రమ ని ర్మాణాల వల్లనే హిమాయత్ సాగర్ జలాశయంలోకి వర్షాకాలంలోనూ వరదనీరు వచ్చి చేరడంలేదనేది టాక్. హిమాయత్ సాగర్ జలాశయానికి ఎఫ్‌టిఎల్, బఫర్ జో న్లు హద్దులుకాదు.. ఏకంగా 10 చ.కి.మీ.ల దూరం వర కు పరివాహక ప్రాంతంగా గుర్తించబడింది. ఈ ప్రాంతం లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదనే ప్రత్యేక నియమావళి, నిర్మాణాలు చేపట్టడంపై నిషేధం అమలు చేస్తున్నది జీఓ నెం. 111. ఈ సరస్సును సంరక్షించాల్సిన బాధ్యత తో వ్యవహరించాల్సిన వారే జలాశయం ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేందుకు కారకులుగా మారడం గమనార్హ ం. ముఖ్యంగా ఈ సరస్సు పరివాహక ప్రాంతంలో పలువురు రాజకీయనేతలు, కొందరు ప్రజాప్రతినిధులు, మాజీ పాలకులు, మరికొందరు ఉన్నతస్థాయిలో ఓ వెలుగువెలిగిన మాజీ ఉద్యోగులు, సినీ ప్రముఖులు ఇక్కడి భూములను కొనుగోలు చేసి యథేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండా గెస్ట్ హౌస్‌లను ఏర్పాటు చేసుకున్నారనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు వీటన్నిటిపైనా ఫిర్యాదులు వచ్చి చేరుతున్నాయి. ఆ ఫిర్యాదులను కూలంకషంగా పరిశీలిస్తూ, విచారణ జరుపుతూ, అధికార వర్గాలతో చర్చిస్తూ చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది.

జలమండలి మొర
ఈ జలాశయం పరివాహక ప్రాంతంలోకి వచ్చిన అక్రమ కట్టడాల వల్లనే మురుగునీరు, కాలుష్యకారకాలు, ఘనవ్యర్థాలు హిమాయత్‌సాగర్‌లోకి వచ్చిచేరుతున్నాయని హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందిస్తున్న జలమండలి కూడా గగ్గోలుపెడుతూ వస్తోంది. సరస్సు పరివాహక ప్రాంతంలో వెలిసిన పలు నిర్మాణాలపై జలమండలి అప్పుడప్పుడు నేనున్నానే ఉనికిని చాటుకునేందుకు చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాగునీరు అందిస్తున్న సరస్సును స్వచ్చమైన నీటితో ఉండేలా జలమండలి ప్రచారం చేస్తోంది. వర్షాకాలంలో వరదనీరు వచ్చిచేరేలా పలుఏర్పాట్లు చేస్తూ వస్తోన్న జలమండలికి బడాబాబుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోలేక హెచ్చరికలతో సరిపెడుతూ వస్తోంది. ఇక్కడి అక్రమ నిర్మాణాల వల్లనే సరస్సులోకి వరదనీటిని తీసుకొచ్చే పిల్లకాలువలు కనుమరుగవుతున్నాయి. నీటి జాలలు మూసుకుపోతున్నాయి. వరద నీటిని తీసుకొచ్చే ఇతర మార్గాలు సైతం నిర్మాణాల ప్రదేశంగా మారుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో హిమాయత్ సాగర్ నీటిని అందించే జలాశయం నుంచి చరిత్రకు నిదర్శనంగా మిగిలిపోనున్నట్టు పరిస్థితులు చెప్పకనే చెప్పుతున్నాయి.

ఫిర్యాదులు
ఉస్మాన్‌సాగర్ పరివాహక ప్రాంతంలోని నిర్మాణాలతో పాటు హిమాయత్‌సాగర్ పరిధిలోనూ అక్రమ నిర్మాణాలపై, ఫాంహౌస్‌లపై, అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదులు చేరినట్టు తెలిసింది. హైడ్రా అధికార యంత్రాంగం అటుగా కూల్చివేతలకు సిద్దమవుతున్నట్టు అక్కడి ప్రజలు వెల్లడిస్తున్నారు. మరి హైడ్రా ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా ? ఉస్మాన్‌సాగర్ పరివాహక ప్రాంతంలో తీసుకున్న చర్యలతో సరిపెడుతుందా ? వేచిచూడాలనేది స్థానికుల్లోని అభిప్రాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News