ఖార్తోమ్ (సూడాన్) : సూడాన్ నుంచి మూడో బ్యాచ్‌లో మరో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సి130 జె విమానం సౌదీ అరేబియా లోని జెడ్డాకు చేరుకున్నట్టు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ కావేరి”కార్యక్రమం కింద సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
అంతకు ముందు మొదటి బ్యాచ్‌లో భాగంగా భారత నావికా దళానికి చెందిన ఐఎన్‌ఎస్ సుమేదా ద్వారా 278 మంది ప్రయాణికులు సూడాన్ పోర్టు నుంచి సౌదీకి చేరుకున్నారు. రెండో బ్యాచ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఎఎఫ్ సి 130 జె విమానంలో 148 మంది భారతీయులను తొలి విమానంలో స్వదేశానికి తరలించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ వివరించింది. వీరిలో 160 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. సూడాన్‌లో మూడు వేల మంది భారతీయులు ఉన్నట్టు గుర్తించారు.