Wednesday, January 22, 2025

ఆపరేషన్ ముస్కాన్ 9 కార్యక్రమం సమీక్షా సమావేశం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ క్రైం : తెలంగాణ రాష్ట్ర అదనపు డిజిపి మహిళా భద్రతా విభాగం ఐపిఎస్ అధికారిణి షికా గోయల్, డిఐజి సుమతి (ఐపిఎస్) సూచనల మేరకు నిజామాబాద్ ఇంచార్జి పోలీసు కమిషనర్ ఆదేశాలతో మంగళవారం ఆపరేషన్ ముస్కాన్ 9 సమీక్షా సమావేశం జిల్లా కేంద్రంలోని పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నందు వివిధ శాఖల ద్వారా నిజామాబాద్ అదనపు డిసిపి (అడ్మిన్) జి. మధుసుదన్ రావు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ 9 కార్యక్రమం జూలై 1 నుంచి 31వ తేదీ వరకు నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో 18 సంవత్సరాలలోపు తప్పిపోయిన / వదిలివేయబడిన కార్మికులుగా ఉన్న బాలబాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించాలని, బలవంతంగా బిక్షాటన చేయించిన వారిపై వెట్టి చాకిరి చేయించిన వారిపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో ఒక ఎస్సై మరియు నలుగురు సిబ్బందిని నియమించడం జరుగుతుందని అన్నారు.

ఇందు కోసం ప్రజలు తప్పిపోయిన బాలురు, బాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం మరియు బాల కార్మికుల గురించిన సమాచారం ఉన్నట్లయితే దిగువ తెలియజేయబడిన ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలన్నారు. డయల్ 10, స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్ 87129 59777, నిజామాబాద్ ఇంచార్జి ఎస్సై 80965 73004, ఆర్మూర్ ఇంచార్జి ఎస్సై 94401 40022, బోధన్ ఇంచార్జి ఎస్సై 94412 50992 ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును.

ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ శ్రీశైలం, సిసిఆర్‌బి ఇన్స్‌పెక్టర్ మోహన్, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్‌పెక్టర్ గోపినాధ్, జిల్లా లేబర్ ఆఫీసర్ యోహన్, జిల్లా సంక్షేమ అధికారి రసూల్ భీ, చైల్డ్ వెల్పేర్ కమిటి చైర్‌పర్సన్ సంపూర్ణ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య, బాలరక్ష భవన్ కో ఆర్డినేటర్ విజయలక్ష్మి, నిజామాబాద్ ఇంచార్జి మహిళా ఆర్ ఎస్‌ఐ స్రవంతి, ఆర్మూర్ ఇంచార్జి ఎస్సై ఇంద్రకరణ్ రెడ్డి, బోధన్ ఇంచార్జి ఎస్‌ఐ వెంకటయ్య, రైల్వే ఎఎస్‌ఐ సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News