బాధిత పిల్లలకు విముక్తి కల్పించిన పోలీసులు
సైబరాబాద్‌లో 453, రాచకొండలో 259మందికి విముక్తి
ముగిసిన ఆపరేషన్ ముస్కాన్
సైబరాబాద్‌లో 205, రాచకొండలో 32 కేసులు నమోదు
హైదరాబాద్: బాల, బాలికలకు విముక్తి కల్పించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు బానిసత్వంలో మగ్గిపోతున్న పిల్లలకు విముక్తి కల్పించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూలైలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో 453మంది బాల, బాలికలకు వివిధ పనుల నుంచి విముక్తి కల్పించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ తొమ్మిది టీములు పనిచేస్తున్నాయి. ఇందులో ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఉమెన్ కానిస్టేబుల్‌గా టీములుగా ఏర్పడ్డారు. ఆపరేషన్ ముస్కాలో భాగంగా కంపెనీలు, ఇండస్ట్రీలు, షాపులు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా దర్పణ్ యాప్ ద్వారా మైనర్ల ఆచూకీ కోసం వెతికారు. ఈ ఆపరేషన్‌లో 49మంది పిల్లలకు భిక్షమెత్తుకుంటుండగా కాపాడారు.
చిత్తుకాగితాలు ఏరుకునే వారు 15, బాలకార్మికులు 371, స్ట్రీట్ చిల్డ్రన్స్ 18, ఇందులో 337మందిని షెల్టర్ హోంలకు తరలించగా, 116మందికి పిల్లల తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పజెప్పారు. పోలీసులకు విముక్తి కల్పించిన వారిలో బయటి రాష్ట్రాలకు చెందిన వారు 143మంది, తెలంగాణకు చెందిన వారు 310మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిలో బాలురు 132మంది, బాలికలు 11మంది ఉన్నారు. ఎక్కువగా బీహార్ రాష్ట్రానికి చెందిన వారు బాలకార్మికులుగా పనిచేస్తున్నారు. ఇందులో 37మంది పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో వారి వివరాలను దర్పణ్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో…
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో 259మంది పిల్లలను కాపాడారు. పిల్లలతో పనిచేయిస్తున్న 32మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఎనిమిది టీములు జూలై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో పిల్లలకు విముక్తి కల్పించారు. ఇందులో 24మంది బెగ్గింగ్ చేస్తున్నారు. ఇందులో 117మంది బాలురు, బాలికలు 40 బాలికలు ఉన్నారు. తెలంగాణకు చెందిన వారు 60 బాలురు, 42మంది బాలికలు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బాలురు 60మంది, బాలికలు 42మంది ఉన్నారు.