Thursday, January 23, 2025

ఆపరేషన్ ముస్కాన్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులందరితో ఆపరేషన్ ముస్కాన్9పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు రెస్క్యూ చేసిన పిల్లల వివరాలు అడిగి తెలుకున్నారు.

అనంతరం మండలాల వారిగా ఎంపీడిఓ అధ్యక్షతన, ఎంఈఓ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్స్, అంగన్వాడీ సూపర్ వైజర్, సిఆర్‌పి, ఐసీపీస్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 తదితరులతో 16 టీం లు ఏర్పాటు చేయాలనీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వారం వారం నివేదిక సమర్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా సంక్షేమ అధికారి సంధ్య రాణి, ఏసీపీ విజయ్ సారధి, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ ధనలక్ష్మి, డిఈఓ జనార్దన్ రావు, మెడికల్ ఆఫీసర్ లలిత, డీసీపీఓ శాంత, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కో ఆర్డినేటర్ సంపత్, జిల్లా ఎస్‌సి వెల్ఫేర్ అధికారి నేతినియల్, జిల్లా బి సి వెల్ఫేర్ ఆఫీసర్ రాజమనోహర్, జిల్లా అధికారులు, సీడీపీఓలు, సి డబ్ల్యుసి మెంబర్స్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కో ఆర్డినేటర్ సంపత్, బాలల పరిరక్షణ అధికారులు, చైల్డ్ లైన్ టీం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News