Sunday, December 29, 2024

పకడ్బందీగా చెక్‌పోస్ట్‌ల నిర్వహణ

- Advertisement -
- Advertisement -
  • జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి

ఆదిలాబాద్ ప్రతినిధి: ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఏడు అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌లను, మూడు రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి వివిధ శాఖల సమన్వయంతో దిగ్వజయంగా ఎటువంటి అక్రమ రవాణాను నిర్వహించకుండా 24 గంటల అప్రమత్తతతో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం బోథ్ మండలంలోని ఘనపూర్ అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ను నేరెడిగొండ మండలంలోని రోల్ మామడ వద్ద నిర్మల్ జిల్లాతో ఉన్న చెక్ పోస్ట్‌ను జిల్లా ఎస్పీ తనిఖీలు చేసి సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగింది. చెక్ పోస్ట్‌ల గుండా ఎన్నికల సమయంలో ప్రజలను ప్రభావితం చేసే వస్తువులు గానీ, రూ. 50 వేల కంటే ఎక్కువగా ఉన్న నగదు కానీ మద్యం ఇతరత్నా వస్తువులను చెక్‌పోస్ట్ గుండా వెళ్లకుండా కచ్చితంగా ఆదేశాలను ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా నేరోడిగొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీకి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి సాయుధ సిబ్బంది ద్వారా ఏర్పాటు చేయబడిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎన్నికల సమయంలో 24 గంటల అప్రమత్తతతో తనిఖీ చేసి ప్రజలో అలసత్వం వహించకుండా విధులను నిర్వర్తించాలని సూచించారు. అనంతరం స్టేషన్ నిర్వహణ పనితీరును, సిబ్బంది పనితీరును జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో డిఎస్పీ సిహెచ్ నాగేందర్, ఇచ్చోడ సీఐ చంద్రశేఖర్, నేరొడిగొండ ఎస్సై సాయన్న, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News