Thursday, September 19, 2024

ఒక మనిషి సైకోగా ఎందుకు మారతాడనేది చూపిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ఆపరేషన్ రావణ్. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు వెంకట సత్య తెలుగు, తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆపరేషన్ రావణ్ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకట సత్య మాట్లాడుతూ “-మన ఆలోచనలే మన శత్రువులు అనేది పురాణాల్లోనే ఉంది. మన ఆలోచన మనం తెలుసుకోవడమే మోక్షమని చెబుతుంటారు. యోగా, ధ్యానం చేసేది మన ఆలోచనలని నియంత్రించుకోవడానికే.

సాధారణంగా సినిమాల్లో మన విలన్స్ భూ ఆక్రమణలు, డ్రగ్స్ అమ్మకం వంటి తప్పుడు పనులు, దౌర్జన్యం చేస్తుంటారు. ఇవన్నీ ఆ విలన్స్ యొక్క యాక్టివిటీస్. కానీ మేము ఆ పనులకు కారణమైన ఆలోచనలను విజువల్ గా చూపిస్తున్నాం. ఒక మనిషి తప్పు చేసిన ఒప్పు చేసినా దానికి ఆ ఆలోచనే కారణం. మన ఇతిహాసాల్లో రామాయణం ఒక థ్రిల్లర్. శ్రీరాముడు తనకు పట్టాభిషేకం జరుగుతుంది అనగా అడవులకు వెళ్లాల్సివస్తుంది. అక్కడి నుంచి రావణుడు సీతను అపహరిస్తాడు. ఎవరు అపహరించారో తెలియదు. ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు వెళ్తాడు. ఇలా రామాయణం థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఆపరేషన్ రావణ్‌లోనూ రామాయణం రిఫరెన్స్ తీసుకున్నాం. గరుత్మంతుడు, రావణుడు, గుహుడు ఇలాంటి పాత్రల ప్రేరణ ఉంటుంది. రామాయణంలో రావణుడు మారువేషం వేసుకుని వచ్చాడు.

మా మూవీలో మాస్క్ పెట్టుకుని వచ్చాడు. అందుకే టైటిల్‌కు ఆపరేషన్ రావణ్ అని పెట్టాం. ఇవాళ సమస్య వస్తే అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా స్పందిస్తారో చూస్తున్నాం. అసలు ఒక మనిషి సైకోగా ఎందుకు మారతాడు అనేది మా మూవీలో చూపిస్తున్నాం. – మా అబ్బాయి రక్షిత్‌ను డైరెక్ట్ చేస్తున్నా అనే విషయం నన్ను పెద్దగా ప్రభావితం చేయలేదు. అతను ఫైట్ సీన్స్ చేసేప్పుడు మాత్రం కొంచెం భయంవేసింది. సినిమాలో రక్షిత్ బాగా నటించాడు. శరవణ వాసుదేవన్ మా మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. – మా చిత్రంలో రాధిక కీలక పాత్ర పోషించారు. మూడు టైమ్ ఫ్రేమ్స్ లో ఆమె క్యారెక్టర్ సాగుతుంది. చరణ్ రాజ్ క్యారెక్టర్ కూడా కీలకంగా ఉంటుంది. మా సినిమా ప్రారంభమైన గంటలోపు సైకో ఎవరన్నది కనిపెడితే ఆ ప్రేక్షకుడికి సిల్వర్ కాయిన్ ఇస్తామని ప్రకటించాం. అలా వెయ్యిమందికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News