Sunday, December 22, 2024

విజువల్ వండర్‌గా ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్..

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్‌లపై సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. యదార్ధ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలతో టీజర్ విజువల్ వండర్‌గా ఉంది.

ఇందులో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా, మానుషి చిల్లార్ రాడార్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇప్పుడు మోషన్ టీజర్‌తో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫిబ్రవరి 16న గ్రాండ్‌గా విడుదల కానుంది. యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషలలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News