Thursday, January 23, 2025

మార్చి 1న ఆపరేషన్ వాలెంటైన్..

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ’ఆపరేషన్ వాలెంటైన్’ అద్భుతమైన పోస్టర్‌లు, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా చూపించిన టీజర్, ఫస్ట్ సింగిల్ వందేమాతరంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తెలుగు, -హిందీ ద్విభాషా చిత్ర కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేస్తున్న మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ’ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అద్భుతంగా చూపించబోతుంది. కుశక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News