Sunday, December 22, 2024

ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ కుశక్తి ప్రతాప్ సింగ్ హడా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ’ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీ..ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, టీజర్, ఫస్ట్ సింగిల్ వందేమాతరంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు.

ఈ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేస్తున్న మానుషి చిల్లర్.. ఇందులో రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ’ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అద్భుతంగా చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News