Wednesday, January 22, 2025

సస్పెన్షన్లపై విపక్షాల ర్యాలీ..

- Advertisement -
- Advertisement -

పార్లమెంటు సమావేశాల్లో మూకుమ్మడి సస్పెన్షన్లను నిరసిస్తూ ప్రతిపక్షాలు గురువారం ఢిల్లీలో ర్యాలీ చేపట్టాయి. పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక్ వరకూ ర్యాలీ నిర్వహించాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో 143 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శించారు.

ర్యాలీకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలనీ, పార్లమెంటులో చర్చకు అనుమతించాలని ఖర్గే డిమాండ్ చేశారు. కాగా ‘ఇండియా’ కూటమికి చెందిన సభ్యులు రేపు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News