Monday, December 23, 2024

మార్కెట్లోకి ఒప్పొ ఎ78 5జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గ్లోబల్ స్మార్ట్ డివైజ్ బ్రాండ్ ఒప్పొ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎ78 5జిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. కొత్త హ్యాండ్‌సెట్ 8జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ సామర్థంతో లభ్యం కానుంది.

ఈ ఫోన్ జనవరి 18 నుంచి రిటైల్ ఔట్‌లెట్లు, ఒప్పొ ఇస్టోర్లు, ఇకామర్స్ పాట్నర్ అమెజాన్ ఇండియా వంటి వాటిలో లభ్యం కానుంది. ప్రత్యేకతలు చూస్తే, 6.56 అంగుళాల కలర్ రిచ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్ ప్రాసెసర్ వంటివి ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News