న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో భారత్‌లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జి సేవలపై దృష్టిపెట్టడంతో పాటుగా ఎగుమతి సామర్థం పెంపు కోసం రాబోయే అయిదేళ్లలో రూ.475 కోట్లు వెచ్చించనుంది. భారత్‌లో 500 కోట్ల డాలర్ల వార్షిక ఎగుమతి సామర్థం చేరుకునేందుకు ఈ పెట్టుబడులు తోడ్పడతాయని ఒప్పో పేర్కొంది. ఈ అయిదేళ్ల వ్యవధిలో 5జి, కృత్రిమ మేధ వంటి నూతనశ్రేణి టెక్నాలజీలపై దృష్టిపెడతామని, భారత్‌లో ప్రాడక్ట్ డెవలప్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేస్తామని కంపెనీ తెలిపింది. కాగా, రూ.4359 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఒప్పో భారత్‌లో పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించడం గమనార్హం. అయితే, తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఒప్పో చెబుతోంది. పలు మార్కెట్లలో మేకిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ల ఎగుమతిని ప్రోత్సహించడానికి ఇదే తగిన సమయమని భావిస్తున్నామని ఒప్పో ఇండియా పబ్లిక్ అఫైర్స్ వైస్‌ప్రెసిడెంట్ వివేక్ వశిష్ట వెల్లడించారు.
Oppo to Invest $60 million in India