భూపాలపల్లి రూరల్: వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసే వారందరికి అవకాశాలు ఉంటాయని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేపాక రాజేందర్ అధ్యక్షతన గణపురం మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని, వచ్చే నాలుగు నెలలు కష్టపడితే భూపాలపల్లిలో అత్యధిక మెజారిటీతో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని జిఎస్‌ఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో గణపురం మండల ఎంపిపి కావటి రజిత రవీందర్, వైస్ ఎంపిపి విడిదినేని అశోక్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంపటి భువనసుందర్‌లతో పాటు అన్ని గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.