Saturday, November 23, 2024

ఎల్‌ఐసి పాలసీల పునరుద్ధరణకు గడువు ఏడు రోజులే..

- Advertisement -
- Advertisement -

Opportunity for policyholders to revive lapsed policies

న్యూఢిల్లీ : జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) తమ పాలసీదారులకు శుభ వార్త తెలిపింది. పాలసీదారులు లాప్స్ అయిన తమ పాలసీలను పునరుద్ధరించుకునేందుకు మరో అవకాశం కల్పించింది. చౌకగా పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ఎల్‌ఐసి గత నెల ఏడో తేదీ నుంచి ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ నెల 25తో ఎల్‌ఐసి చేపట్టిన ప్రత్యేక క్యాంపెయిన్ ముగియనుంది. అనివార్య పరిస్థితుల్లో ప్రీమియం చెల్లించలేకపోయిన వారికి ప్రయోజనం కల్పించేందుకు ఈ పునరుద్ధరణ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో రిస్క్ కవరేజ్ కొనసాగేందుకు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండోసారి పాలసీదారులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయిన తేదీ నుంచి అయిదేళ్ల లోపు కొన్ని షరతులకు లోబడి ఈ అవకాశం కల్పిస్తున్నది. ఈ ప్రత్యేక క్యాంపెయిన్‌లో కొన్ని అర్హమైన ప్లాన్లు కల పాలసీలకు లేట్ ఫీజుతో ప్రీమియం చెల్లింపునకు వీలు కల్పించింది. అయితే టర్మ్ అస్యూరెన్స్ అండ్ మల్టీపుల్ రిస్క్ పాలసీలకు మాత్రం ఈ మినహాయింపులు వర్తించవు. ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లో పాలసీదారులు మరణిస్తే వారి కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం వుందన్న ఉద్దేశంతో ఎల్‌ఐసి ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News