Friday, January 10, 2025

పాలిటెక్నిక్ అభ్యర్థులకు మరో అవకాశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి కొన్నేళ్ళుగా ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు సర్కారు మరో అవకాశం కల్పించింది. 1990 నుంచి ఇప్పటివరకు ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. ఇలాంటి వారికి ఈ ఏడాది జూన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి సి. శ్రీనాథ్ తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని శ్రీనాథ్ తెలిపారు. అభ్యర్థులు రూ. 3వేలు పరీక్ష ఫీజు చెల్లించాలని అన్నారు. రూ. 400 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 14 వరకు, తాత్కాల్ స్కీం కింద ఎగ్జామ్ ఫీజుతో పాటు మరో రూ. 6వేలు అదనంగా కలిపి ఏప్రిల్ 15 వరకు చెల్లించాలని పేర్కొన్నారు.

ఇండస్ట్రియల్ అసెస్‌మెంట్ ఫీజుగా రూ. 3వేలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. మూడేళ్ల కాలవ్యవధి గల ఈ కోర్సును గరిష్టంగా 6 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత సిలబస్‌ను మార్చడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం లభించడం లేదని చెప్పారు.ఇలాంటి వారంతా తాజాగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనాథ్ సూచించారు. 1990 నుంచి పాస్ కాలేకపోయిన వారి సంఖ్య వెయ్యికి పైగా ఉంటుందని తెలిపారు. పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు పొంది నిర్ధేశించిన సమయంలో కోర్సు పూర్తి చేయలేకపోయిన వారికి మానవతా దృక్పథంతో ప్రభుత్వం ప్రత్యేక అనుమతినిస్తుంది. ఇలా ఈ సారి 1990 నుంచి 2018 వరకు గల అభ్యర్థులు ఫెయిల్ అయిన సబ్జెక్టులకు పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా.. వీరికి మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News