Monday, January 20, 2025

పోస్టాఫీస్‌ల ద్వారా రైతుబంధు నగదు పొందే అవకాశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోస్టాఫీస్‌ల ద్వారా రైతుబంధు నగదు పొందే అవకాశం రైతలకు కల్పించామని తపాలాశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటల సాగు పెట్టబడిగా 66.61లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.7600కోట్లు నగదు జమ చేస్తోదని తెలిపారు.రైతులు నగదు డ్రా చేసుకునేందుకు బ్యాంకుల వరకూ వెళ్లాల్సిన పనిలేకుండా పోస్టాఫీస్‌ల ద్వారానే నగదు పొందే ఏర్పాటు చేశామని తెలిపారు.

రాష్ట్రంలో 5762మైక్రో ఏటిఎంలను సిద్దం చేశామన్నారు. 5386 బ్రాంచ్ పోస్టాఫీస్‌ల ద్వారా రైతుబంధు నగదు పంపిణీకి అవసరమైన నిధులు సిద్దంగా ఉంచినట్టు తెలిపారు. రైతుతు తమ ఆధార్‌కార్డుకు లింక్ అయివున్న సెల్ ఫోన్ ద్వారా ఏ పోస్టాఫీస్‌లోనైనా రైతుబంధునిధులు పొందవచ్చని తెలిపారు. రైతులు ఒక్కొసారి గరిష్టంగా రూ.10వేల వరకూ నగదు డ్రా చేసుకోవచ్చని ఈ సదుపాయం రైతులందరికీ ఉచితంగానే కల్పించామని తెలిపారు. ఈ ఏడాది మే,జూన్ నెలల్లో కూడా రాష్ట్రంలోని తపాల కార్యాలయాల ద్వారా పిఎం కిసాన్ పథకం కింద 86,518మంది రైతులకు 34.58కోట్లు రైతులకు అందజేసినట్టు తపాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ మేరకు ఒప ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News