- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అనుమతి లభించలేదు. 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలను ప్రదర్శించేందుకు కేంద్రం అనుమతించగా.. నైపుణ్యాభివృద్ధి, విమానయాన శాఖ, సమాచార – తపాలా, హోంశాఖ, జలశక్తి, సాంస్కృతిక శాఖల శకటాలకు అనుమతి లభించింది. వీటితో పాటు అరుణాచల్‌ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్ శకటాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శకటాలకు మరోసారి అనుమతి దక్కలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఏడాది ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శకటాలను ఢిల్లీలో ప్రదర్శిస్తున్న సంగతి విధితమే. ఈ ఏడాది కేవలం 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలకు మాత్రమే అనుమతి లభించింది. తెలంగాణ, ఏపీకి నిరాశే మిగిలింది.
- Advertisement -