హైదరాబాద్ : రాష్ట్రంలో జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఈ నెలాఖరుతో ముగించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలల జాబితాను ముందుగా ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కొన్ని కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రైవేటు కాలేజీలకు బోర్డ్ గుర్తింపు ప్రక్రియ కొన్నేళ్ళుగా విమర్శలకు గురవుతుండటంతో ఈసారి ప్రక్రియ జనవరిలోనే మొదలుపెట్టారు. అయితే ఇప్పటివరకు అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తి కాలేజీలకు చివరిసారిగా నెలాఖరు వరకు అవసరమైన పత్రాలు సమర్పించాలని ఇంటర్ బోర్డు నోటిసులు జారీ చేయనుంది. నెలాఖరు వరకు కూడా నిబంధనల మేరకు అవసరమైన పత్రాలు సమర్పించని కాలేజీలకు ఈసారి అనుబంధ గుర్తింపు నిలిపివేయనున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం కళాశాలలకు అనుబంధ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల జాబితాను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
అఫిలియషన్లు పూర్తి కాని ఇంటర్ కాలేజీలకు నెలాఖరు వరకు అవకాశం
- Advertisement -
- Advertisement -
- Advertisement -