Monday, February 3, 2025

ప్యాసవుతారనే గ్యారంటీ ఉంటేనే పైతరగతులకు అవకాశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ పాఠశాలల్లో 9 వ తరగతి దాటి చదివేందుకు అందరు విద్యార్థులను ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అనుమతించడం లేదని, కేవలం పాస్ అవుతారన్న గ్యారంటీ ఉన్నవారిని మాత్రమే పైతరగతులకు పంపిస్తున్నారని తాను విన్నానని ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారం ఆఖరు తేదీ కావడంతో ప్రచారాలు వేడెక్కాయి. ఈ సందర్భాంగా తాజాగా కొంతమంది ఢిల్లీ విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తమ విజయంగా చెప్పే విద్యావిధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “కేవలం పాస్ అవుతారన్న గ్యారంటీ ఉన్నవారిని మాత్రమే పైతరగతులకు పంపిస్తున్నారట.

ఎందుకంటే ఫలితాలు సరిగ్గా రాకపోతే ప్రభుత్వం పరువు పోతుందని వారు భావిస్తున్నారు. ఇలా విద్యావ్యవస్థ లోనూ వారు అవినీతికి పాల్పడుతున్నారు” అని విద్యార్థులతో ప్రధాని అన్నారు. ఆప్ ప్రతిష్ఠను పెంచుకునేందుకు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మోడీ దుయ్యబట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విద్యార్థులు నేర్చుకోవడాన్ని అభివృద్ధి చేయడానికి దృష్టి కేంద్రీకరించే బదులు పరీక్షలకు కొంతమంది విద్యార్థులను పంపించక పోవడం, అసలైన పురోగతి కన్నా ప్రచారానికే ప్రాధాన్యం ఇవ్వడం పై బీజేపీ నేత ఒకరు తీవ్రంగా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News