Sunday, January 19, 2025

ప్రతిపక్ష కూటమికి ఇండియా(INDIA)గా నామకరణం?

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రతిపక్ష కూటమికి ఇండియా(ఇండియన్, నేషనల్, డెమోక్రటిక్, ఇన్‌క్లూసివ్, అలయన్స్) అని పేరు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశంలో ఈ విషయమై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని గద్దె దింపేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు 26 విపక్ష పార్టీలకు చెందిన అగ్రనాయకులు మంగళవారం నాడిక్కడ సమావేశమయ్యారు. ప్రతిపక్ష కూటమికి ఇండియా అనే పేరు ఖరారు చేసే అవకాశం ఉందని సూచిస్తూ కాంగ్రెస్ ఎంపి మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్‌లో ఇండియా విల్ విన్ అంటూ ట్వీట్ చేశారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపి డెరెక్ ఓబ్రియన్ చెక్ దే ఇండియా అంటూ ట్వీట్ చేయడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News