Monday, December 23, 2024

ఐకమత్యం లేక బలహీన పడిన విపక్షాలు: అమర్తసేన్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : ఐకమత్యం లేకపోవడం వల్లనే భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయని ప్రముఖ ఆర్థిక వేత్త , నోబెల్ బహుమతి గ్రహీత అమర్తసేన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కులగణన పరిగణన లోకి తీసుకోవాల్సిన అంశమే అని అమర్త సేన్ అన్నారు. కానీ అంతకంటే ముందు మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ , లింగ సమానత్వం వంటి అంశాల్లో వెనుకబడిన వారికి మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశ పౌరుడినైనందుకు చాలా గర్విస్తునానని తెలిపారు. కానీ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంకా చాలా కృషి జరగాలన్నారు.

జేడీయు , ఆర్‌ఎల్‌డీ వంటి పార్టీలు వైదొలగడంతో విపక్ష ఇండియా కూటమి ఆదరణ కోల్పోయిందని సేన్ విశ్లేషించారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉండే బీజేపీని ఓడించడానికి కావాల్సిన బలం లభించి ఉండేదన్నారు. వ్యవస్థాగత సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్, తన ఘనమైన గతం నుంచి స్ఫూర్తి పొందాలని హితవు పలికారు. బీజేపీ నేతృత్వం లోఓని ఎన్‌డీయే ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అమర్తసేన్ విమర్శలు గుప్పించారు. భారత్ అభివృద్ధికి నిరక్షరాస్యత, లింగ అసమానత్వం అడ్డంకులుగా మారాయని తెలిపారు. భారత పాలకవర్గం పూర్తిగా ధనవంతుల పక్షానే నిలుస్తోందని ఆరోపించారు. రాజ్యాంగంలో మార్పులపై ప్రస్తావించగా, దానివల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News