Friday, November 8, 2024

అదానీ సంక్షోభంపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్..

- Advertisement -
- Advertisement -

అదానీ గ్రూప్ బాగోతంపై హిండెన్ బర్గ్ నివేదికపై కాంగ్రెస్ ఎంపి మాణికం ఠాగూర్ గురువారం వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అదానీ స్టాక్ క్రాష్‌పై సీపీఐకి చెందిన బినోయ్ విశ్వన్ రాజ్యసభలో ఇచ్చిన బిజినెస్ నోటీసును సస్పెండ్ చేశారు. అదానీ స్టాక్ క్రాష్‌పై అత్యవసరంగా చర్చించాలని సిపిఐకి చెందిన బినోయ్ విశ్వన్ రాజ్యసభలో డిమాండ్ చేశారు.

అదానీ గ్రూప్ బాగోతంపై అమెరికా ఆధారిత పెట్టుబడి పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో ఈ అంశంపై చర్చించాలని పలువురు ప్రతిపక్ష పార్టీ ఎంపిలు డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మారింది.

అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని లోక్‌సభ ఎంపి మనీష్ తివారీ కోరారు. అదానీ కుంభకోణంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్, డిఎంకె, టిఎంసి, ఎస్‌పి, జెడియు, శివసేన (యుబిటి), సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపి, ఐయుఎంఎల్, ఎన్‌సి ఆప్, కేరళ కాంగ్రెస్ అదానీ ’స్కామ్’పై పార్లమెంటులో చర్చను కోరాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News